తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లపై టార్గెట్ చేశాయి విపక్షాలు. కరీంనగర్ కదనభేరి సభలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లపై ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో దౌర్జన్యంగా దోపిడీ చేసి.. ఢిల్లీకి మళ్లీ సూట్ కేసులు పంపుతున్నరు.. ఆ పని మీద ఫుల్ బిజీగా ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.