ప్రేమకు వయసు అడ్డుకాదు.. పేదరికం అడ్డుపడదు.. 93 ఏళ్ల వృద్ధుడి ప్రేమ కథ ఇప్పుడు నెట్టింట ప్రజల మనసులను హత్తుకుంటోంది.. తన జీవిత భాగస్వామికి మంగళసూత్రం కొనాలన్న చిన్న కోరిక ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి ప్రేమను గౌరవించిన బంగారం షాపు యజమాని.. మానవత్వం అంటే ఇదే అని గుర్తుచేశాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన నివృత్తి శిండే.. తన భార్య శాంతాబాయితో కలిసి తెల్లటి ధోతి కుర్తా ధరించి నిరాడంబరంగా జ్యువెలరీ షాప్‌కు అడుగుపెట్టగా.. వారి ప్రేమను చూసి షాపు యజమానే ముగ్దుడయ్యాడు.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ మహరాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన.. ప్రేమంటే ఇదేరా.. అంటూ అందర్నీ ఆకట్టుకుంటోంది..