జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై పొలిటికల్ ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు.. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ భగ్గుమంది. ఇంతకీ.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీనా?.. రేవ్ పార్టీనా?.. అసలు.. మొత్తం ఎపిసోడ్‌పై పోలీసు ఎంక్వైరీలో ఏం తేలబోతోంది?..