ఫ్రీ బస్ సర్వీసును స్వాగతిస్తున్నాం.. అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు-Akbaruddin Owaisi Telangana Assembly Session (1)

ముస్లింల అభివృద్ధికి ఆ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు తెలంగాణ శాసనసభ సమావేశాలు తొలిరోజే మాటల తూటాలు పేలాయి.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయంటూ విమర్శించారు అక్బరుద్దీన్‌.. రిజర్వేషన్ల అంశం సహా ముస్లింలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.