తొలి విడత పల్లె పోరులో లెక్క తేలింది. గ్రామాల్లో హైఓల్టేజ్ క్రియేట్ చేసిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అనుచరులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు.