అసెంబ్లీ వేదికగా సోమవారం హైవోల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయ్ కాంగ్రెస్ అండ్ బీఆర్‌ఎస్. మేడిగడ్డ ఇష్యూతో BRSను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం... KRMB అంశంతో ఎదురుదాడికి బీఆర్‌ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయ్. దాంతో, రేపు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.