రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ముంబయ్ లో గుట్టుగా కాపురం

వెంకటేశ్, స్వప్న ఇద్దరిదీ జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామం. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా ఓ సినిమాను తలపించే ప్రేమ కథగా కొన్నేళ్లపాటు నడిచింది. పెద్దలు ఒప్పుకుంటారో, లేదోనన్న భయంతో వీరిద్దరూ రహస్యంగా 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పొట్టకూటి కోసం ముంబై బాట పట్టిన కట్కూరి వెంకటేశ్... కొంతకాలం స్వప్నతో కలిసి ముంబైలో కాపురం చేశాడు. అదే సమయంలో ఓ పండంటి కొడుకు పుట్టాడు. అతడికి పేరు ప్రత్యేకంగా ఉండేలా మౌర్యన్ అని పెట్టుకున్నారు. స్వప్న, వెంకటేశ్ జంట కాపురం అన్యోన్యంగా సాగిపోతున్న క్రమంలో వెంకటేశ్ కు మరో యువతితో ముంబైలో పరిచయం ఏర్పడింది.