తెలంగాణ - ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం బయట పడింది. కొండలపై నుండి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో జలపాతాలు మరింత సందడిగా మారాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆ జలపాతాలలో సందర్శకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.