రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట.. అంబేద్కర్ ఎదుట జరిగిన ఆదర్శ వివాహం..

కుల మతాలు, సాంప్రదాయాలకు అతీతంగా వారిద్దరూ ఒక్కటయ్యారు. బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షి గా నేటి సమాజానికి ఆదర్శంగా ఈ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న బీరవల్లి ప్రశాంత్, నాగ జ్యోతి వివాహం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో జరిగింది ఈ ఆదర్శ వివాహం.