బుర్రుపిట్టలకు చుక్కలు చూపించిన రైతులు.. వినూత్న ఆలోచనతో పంటకు రక్షణ..

రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాలి. పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకూ రేయింబవళ్లు కంటికి రెప్పలా సంరక్షించాలి. వేలకు వేలు పోసి రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఒక వైపు అతివృష్టి, అనావృష్టి, చీడ పీడలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంటే.. మరోవైపు ఆ పంటపై జంతువులు, పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలి పోటులా మారాయి.