మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం.. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. ఏడు రంగుల హరివిల్లు వర్ణాలను చూస్తూ విస్తు పోతుంటాం.. అలాంటిది చేనేత ఇక్కత్ వస్త్రాన్ని పదివేల రంగుల షేడ్స్‌తో మగ్గంపై నేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు నేత కార్మికుడు. కొత్తగా శాలువాపై పదివేల రంగుల డిజైన్లతో ఇండియా మ్యాప్‌ను ఆవిష్కరించి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. తన సృజనాత్మకతతో 'సంత కబీర్' పురస్కారాన్ని పొందారు.