మేధావులు కొత్తగా ఏమీ చెయ్యరు.. ఉన్న వాటినే కొత్తగా ఆవిష్కరిస్తారు.. అనే నానుడి వినే ఉంటారు. అచ్చం అలాంటి సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. పాత వాహనాలకు కొన్ని మరమ్మత్తులు చేసి, కొత్తగా వినియోగించడమేకాకుండా అందులో ఓ అద్భుత సందేశాన్ని కూడా ఇస్తున్నారు నేటి యువత. మూల చేరిన వాహనాలను పాత సామాన్లవారికి అమ్మేయకుండా.. సరికొత్త ట్రెండ్‌లను సృష్టిస్తున్నారు. పాత వాహనాలను కాస్త వైవిధ్యంగా మార్చి.. మళ్లీ వాడుకునేలా రూపొందిస్తున్నారు. ఇలా పాత డొక్కు వాహనాలను మొబైల్ హోమ్‌లుగా మార్చడం నుంచి వెరైటీ డిజైన్లతో షోపీస్‌లను రూపొందించడం వరకు తమ ట్యాలెంట్‌కు ఆకాశమే హద్దుగా అద్భుతాలను సృష్టిస్తున్నారు.