రిత్ర సృష్టించిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌..

ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అరుదైన ఘనతను సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే చేర్చి చరిత్ర సృష్టించింది. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ నుండి నిర్వహించిన ఈ చారిత్రాత్మక టెస్ట్ ఫ్లైట్, పునర్వినియోగ రాకెట్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తాను చాటుకుంది స్పేస్ ఎక్స్.