కారు అమాంతం కాల్వలోకి దూసుకెళ్లింది..! తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలనికి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం(ఆగస్ట్ 16) రాత్రి కురిసిన వర్షానికి పనామా గోడౌన్స్ వద్ద ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబాన్ని క్షేమంగా కాపాడారు.