గోదాట్లో చేపల వేట.. నాటు తుపాకులతో పహారా

గోదాట్లో చేపల వేట.. నాటు తుపాకులతో పహారా ఒకప్పుడు గోదావరి తీరంలో చేపల వేట అంటే వలలు, పడవలు కావాలి.. ఇప్పుడైతే తుపాకులు, కర్రలు, కటారులు కావాలట. ఎందుకంటే అక్కడున్న స్థానిక మత్స్యకారులను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బెదిరించి చేపల ఎత్తుకెళ్తున్నారట. కొందరు ఏకంగా నాటు తుపాకీలతో బెదిరిస్తున్నారని ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తుతున్నారు. ఎట్టకేలకు స్ధానిక మత్స్యకారులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు.