లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తోంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక అరోపణలు చేస్తోంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ.