పారిస్‌లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్ ఒపెనింగ్ సెర్మనీలో మెగా స్టార్ చిరు తన ఫ్యామిలితో కలిసి పాల్గొన్నారు. తన వైఫ్ సురేఖ.. అబ్బాయి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. కోడలు ఉపాసన తో కలిసి ఈవెంట్ ముందు పారిస్ నగర వీధుల్లో హంగామా చేశారు. ఈఫిల్ టవర్ ముందు.. సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గర ఉపాసన- చెర్రీ కాసేపు అలా కూర్చోగా... చిరు సురేఖ పారిస్ నగర వీధులను చుట్టేస్తూ కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను.. ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి కాస్తా బయటికి వచ్చాయి. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.