ఒక వ్యక్తి బతికినంత కాలం ఎలా ఉన్నా.. అతను చనిపోయాడు అని తెలిస్తే మాత్రం పాపం అని అంటాం.. అతని గురించి కాసేపయిన కాస్త గౌరవంగా మాట్లాడుకుంటాం.. కుటుంబ సభ్యులు సైతం బతికినంత కాలం అతను ఎలా బతికినా.. కనీసం అంతిమ యాత్ర అయిన ఘనంగా చేయాలని భావిస్తారు. అందులో ఏ లోటు లేకుండా సంప్రదాయ బద్దంగా వీడ్కోలు పలుకుతారు. అయినవారంతా చివరి చూపు చూసుకుంటారు. కొందరయితే ప్రమాదంలో తమ వారు మృతి చెందితే చట్టప్రకారం.. మృతదేహానికి పోస్టు మార్టం చేయాల్సి ఉండగా డెడ్ బాడీ శరీర భాగాలు కట్ చేయటం ఇష్టం లేక పోస్టుమార్టం చేయడానికి అంగీకరించరు.