తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం మిగిలిన 8 స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆశావహుల గెలుపు లక్ష్యాలు పరిశీలిస్తూనే పక్క పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గెడం నగేష్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది కమలం పార్టీ.