తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్..ఎక్కడంటే

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేసిన కీర్తి రిచ్మండ్‌ విల్లాస్‌ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఇక్కడ గణపతి లడ్డూ ధర కోటి 87 లక్షల రూపాయిలు పలికింది. ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు.