మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ సేవను యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షణకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు.