వరాహ నదిలో బయటపడిన అమ్మవారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం పెదఉప్పలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. వరాహనదిలో కొందరు వ్యక్తులు ఎడ్లబళ్లకు ఇసుక తవ్వుతుండగా.. రాయికి పాదంతో కూడిన ఆకారం కనిపించింది. దీంతో గ్రామస్తులను పిలిచి ఇసుకలో కప్పి ఉన్న రాతి ప్రతిమను వెలిక తీయగా.. అది నూకాంబిక అమ్మవారి విగ్రహంగా గుర్తించారు.