ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..

ఏపీలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తు్న్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు ఉందని.. వీరి కోసం మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.