జాతరలో సింగర్‎గా మారిన మంత్రి సీదిరి అప్పలరాజు..

ఎన్నికల సమయంలో రాజకీయపార్టీల నాయకుల చేష్టలు కొన్నిసార్లు వింతగా, ఆసక్తికరoగా ఉంటాయి. ప్రజలలో మమేకం అయ్యేందుకు వారు ఏ అవకాశాన్నీ వదులుకోరు. కొంతమంది కూలీగా అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు దోబీ దగ్గరకెళ్ళి బట్టలు ఇస్త్రీ చేస్తూ దోబిలా మారతారు.ఇలా ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు దశావతారాలు ఎత్తుతూ ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి సీదిరి అప్పలరాజు తనలోని మరో యాంగిల్‎ను బయటపెట్టారు.