హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు వరుసగా మెరుపు దాడులు చేస్తున్నారు. తాజాగా బేగంబజార్‌లోని ఆకాష్ ట్రేడింగ్ కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 60 టన్నుల కొబ్బరిపొడిని సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన కొబ్బరిపొడి విలువ 92 లక్షల 47 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్‌కి విరుద్ధంగా కోకోనట్ పౌడర్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు గుర్తించారు.