మాటలతో కాదు.. చేతి హావభావాలే వీరి ప్రచారాస్త్రాలు..

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో మాధవీ లత ఏం చేయగలరు? అది మజ్లిస్‌ అడ్డా. ఒవైసీ గడ్డ అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు మాధవీలత ప్రచారం పాతబస్తీలో బీజేపీ కేడర్‌కు ఊపు తెస్తోంది. మజ్లిస్‌ ఎన్నికల గుర్తు పతంగి. దాన్ని చేతులతో ఎగరేసి కట్‌ చేసినట్లు చూపిస్తున్నారు మాధవీలత. నాకు మాటలు అక్కర్లేదు. చేతలు చాలు అంటూ మాధవీలత చేస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌కు రియాక్షన్‌ కూడా అంతే తీవ్రంగా వస్తోంది. అయినా తగ్గేదే లా అన్నట్లు మాధవీలత దూసుకుపోతున్నారు.