తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..

గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‎గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా అళ్ళగడ్డ సబ్ డివిజన్‎లో గల కోవెలకుంట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్ళలో ఎనిమిది ఇండ్లలో చోరి జరిగింది. దొంగలు ఎలాంటి క్లూ లేకుండా చోరీలకు పాల్పడటం పోలీసులకు సవాల్‎గా మారింది.