హైదరాబాద్ తెల్లాపూర్ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణుడి ఆలయ రెండో వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ నెల 19 వరకు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శనివారం యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మహా కుంభ స్థాపన అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి.