యూపీలోని మొరాదాబాద్‌లో విషాద ఘటన జరిగింది. రెహాన్ ఖురేషి (25) అనే యువకుడు మొబైల్ షాపు నడుపుతున్నాడు. మధ్యాహ్న వేళలో అతను భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి.. మళ్ళీ షాపుకి బయల్దేరాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు.