మావుళ్ళమ్మకు 1000 కేజీల సారె..కార్తీక మాసంలో భక్తుల సమర్పణ

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు.. ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మావుళ్ళమ్మ మాలధారణ దీక్షాపరుల.. సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం లో దీక్షాధారులు సుమారు 1000 కేజీల పలురకాల స్వీట్స్, పిండివంటలతో సారెను ఏర్పాటు చేసారు. పండ్లు, పువ్వులు - 115 కేజీల బారి లడ్డుతో మావుళ్ళమ్మ అమ్మవారి పూరిగుడి నుండి పట్టణంలోని ఊరేగింపు చేసారు.