ఆమె ఎత్తు కాదు మనసు చూసి ఓటేశారు..

సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల క్యాండిడేట్లను చిత్తు చేసి.. 3 అడుగులు ఎత్తు ఉన్న స్వతంత్ర అభ్యర్థిని తిరుపతమ్మ ఘన విజయం సాధించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో 20 ఓట్ల తేడాతో ఆమె సర్పంచ్‌గా గెలిచి, ఊరి ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచారు.