బాధ్యతను విస్మరించిన బడి పంతులు..స్కూల్లోనే సెల్ ఫోన్‌తో కుస్తీలు..! విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడీని సస్పెండ్ చేశారు డిఇఓ. పాఠశాలలో సెల్ ఫోన్ చూస్తూ టైంపాస్ చేసిన స్కూల్ టీచర్ నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో ఉపాధ్యాయుడు చందులాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.