Heavy rains: వరుణ బీభత్సం.. గోదావరికి పోటెత్తిన వరద.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు బంద్ తెలుగు రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు.. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వానల తీవ్రతకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు, రైల్వే ట్రాకులు సైతం తెగిపోతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేశారు.