ఉల్హాస్‌నగర్ ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల మామా పగారే కాంగ్రెస్ నాయకులుగా కొనసాగుతున్నారు. మామా పగారే ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కళ్యాణ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నందు పరాబ్ నాయకత్వంలో మమా పగారేను పట్టుకుని నిరసన తెలిపారు. పగారే చేసిన చర్యను దేశ అత్యున్నత నాయకత్వాన్ని అవమానించారని పేర్కొన్నారు. ప్రతీకారంగా, బీజేపీ కార్యకర్తలు పగారేను పిలిచి, అతనికి చీర కట్టించారు. ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.