అసలు అడవుల జిల్లా అందులోను వేసవి వచ్చిందంటే

అసలు అడవుల జిల్లా అందులోను వేసవి వచ్చిందంటే భూగర్బ జలాలు అడుగంటిపోయి దాహం.. దాహం.. అని గొంతెత్తే జిల్లా. అలాంటి ప్రాంతంలో 30 ఏళ్లుగా ఎలాంటి నీటి కష్టం రాకుంటే అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా..! అదిగో అలాంటి అదృష్టాన్ని ప్రసాదించింది బోథ్ మండల కేంద్రంలోని ఓ బోరింగ్. అలా ఇలా కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్టిల్ కంటిన్యూ అన్నట్టుగా మండు వేసవిలోనూ ధారాళంగా జలదారతో దాహాన్ని తీర్చింది. అంతే అక్కడి స్థానికులు ఆ బోరింగ్‌ను తమ ఇంటి పెద్ద దిక్కుగా భావించి సత్కరించాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నదే తడువుగా ఇదిగో ‌ఇలా బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు చేసి పూల మాల, శాలువాలతో సన్మానించి బోరింగ్ రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మైసమ్మ కాలనీలో చోటు చేసుకుంది.