అయ్య బాబోయ్.. ఇదేమి వింత.. శివాలయం వెనుక వందలాది సర్పాలు..

కృష్ణా జిల్లా నాగాయలంకలోని పురాతన చరిత్ర కలిగిన శ్రీ రామ పాద క్షేత్రం ఆలయం ఓ అద్భుతానికి వేదికయింది. ఆలయం వెనక వైపు నెమ్మదిగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో పాములు ప్రత్యక్షం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడి నదిని సందర్శించేందుకు వచ్చిన జనాలు.. నదీ తీరంలో ఉన్న భక్తులు.. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్దులయ్యారు. ఈ చిత్రాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.