తెలంగాణలో పల్లె పోరు జోరు మీదుంది.. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కారును పోలీసులు తనిఖీ చేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపి చెక్ చేశారు.