ఈ మధ్యకాలంలో కుక్కలు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఉన్నట్లుండి నడిచి వెళ్లే వారిని కరవడం, వారిపై దాడి చేయడం, సడన్ గా బండిమీద వెళ్ళే వారి వెంట పడడం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది. ఓ వ్యక్తి అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుండగా.. కొన్ని కుక్కలు అతన్ని వెంబడించాయి.. దీంతో వాటి నుంచి తప్పించుకునేందు బైక్‌ను వేగంగా నడిపిన వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.