దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జీయో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేడుక ఘనంగా ప్రారంభం అయింది. ప్రధాని మోడీ ప్రారంభించిన వేవ్ సమ్మిట్ వేడుకలను భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మలయాళ హీరోలు, హీరోయిన్లు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సిని ప్రయాణం గురించి ఈ వేడుకలో గుర్తు చేసుకున్నారు.