ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి పనిచేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.