అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ళ ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. నెల రోజులపాటు ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది.