టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్ తో భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులేమో భయపడుద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెంపుల్ సిటీ తిరుపతిలో పరిస్థితి.