అర్ధరాత్రి నడి రోడ్డులో మాటు వేసిన ఉన్నతాధికారులు..

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్ట్ కావడంతో సాధారణంగానే ఎక్కువగా తనిఖీలు జరుగుతుంటాయి. అయితే అర్ధరాత్రి ఇద్దరూ వ్యక్తులు అక్కడే మాటు వేశారు. మందీ మార్బలంతో వరుసగా వస్తున్న లారీలను వారే చెక్ చేయడం ప్రారంభించారు. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్.. ఏం జరిగింది..? ఎందుకింత హడావుడి చేస్తున్నారు అని ప్రశ్నించుకోవడం జరిగింది.