కల్మేగి తుఫాను మధ్య ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది. అధికారుల ప్రకారం, ఇప్పటివరకు కనీసం 66 మంది మరణించగా, 13 మంది గల్లంతయ్యారు. భారీ వర్షం, వరదల కారణంగా ఎక్కువ మంది మరణించారు. చాలా ప్రాంతాలలో, ఇళ్ళు కొట్టుకుపోయాయి. వాహనాలు మునిగిపోయాయి. వందలాది కుటుంబాలు భద్రత కోసం ఇంటి పైకప్పులపైకి వెళ్లి ప్రాణాలను కాపాడుకుంటున్నారు.