రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ సెంట్రింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతి కష్టం మీద కార్మికులను బయటకు తీసిన స్థానికులు.. ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.