మానవత్వం చాటుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగింది. అటుగా వెళుతున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తన కాన్వాయ్‌ను ఆపి సంఘటన స్థలంలో జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ పిలిపించి వెురుగైన వైద్యం కోసం ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంత బీజీ షెడ్యూల్‌లో ఉన్న ఆపద సమయంలో ఆదుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌కు స్థానికులు అభినందనలు తెలిపారు.