మంటల్లో 300 మంది కార్మికులు.. ఆపద్భాందవుడైన విద్యార్థి

వయస్సుతో సంబంధం లేకుండా.. ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహారించాడో చిన్నోడు. ఫైర్ యాక్సిండెంట్‌లో చిక్కుకున్న 50మంది కార్మికులను ప్రాణాలకు తెగించి కాపాడి ఆపద్భాందవుడయ్యాడు. హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు పొందాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నందిగామకు చెందిన పదవ తరగతి విద్యార్థి సాయిచరణ్‌ నేనున్నాంటూ ఆపద్భాంధవుడిలా ముందుకు వచ్చాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు.