అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మారు మూల గ్రామాలు ఆచారాల వ్యవహారాలకు పెట్టింది పేరు. తరతరాల సంప్రదాయాన్ని పాటిస్తూ వినూత్నంగా నిలుస్తారు ఈ గ్రామాల ప్రజలు. అలాంటిదే కొమురంభీం జిల్లా కౌటాలలో అనాదిగా సాగుతూ వస్తున్న ఆచారం బొమ్మల పెళ్లి. పిల్లల ఆనందం కోసం ఏదో బొమ్మలకు తూతూ మంత్రంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం కాదు.. నిజంగా పెళ్లి తంతు ఎంత అట్టహాసంగా జరుగుతుందో అదే తీరున బొమ్మల పెళ్లి చేస్తారు ఈ గ్రామాల ప్రజలు.