ఏనుగు దాడిలో జర్మన్ టూరిస్ట్ మృత్యువాత

ఓ 60 ఏళ్ల వృద్ధ టూరిస్ట్ సరదాగా పర్యటనకు వచ్చి అనుకోకుండా చావు అంచులకు చేరాడు. ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చినా లెక్క చేయకుండా తన చావును తానే కొని తెచ్చుకున్నట్లు అయింది అతని పరిస్థితి. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కనే ఆ వృద్ధుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.