నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో రెండోవ శ్రావణ శుక్రవారాం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు 15 వందల మంది మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా అందజేససింది. అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పం నిర్విఘ్నంగా జరిపించారు.